అందరూ నోరు విప్పారు.. ఒక్క కొరటాల తప్ప

Why Koratala Siva remains silent on NTR's birthday
Why Koratala Siva remains silent on NTR's birthday
 
నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలోని చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకులు, చేయాల్సిన దర్శకులు కూడ వారి వారి సినిమాల గురించి అప్డేట్స్ ఉచ్చారు.  రాజమౌళి నుండి ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ రాగా ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుకు సైతం ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాల మీద మంచి హింట్స్ ఇచ్చి అభిమానుల్ని ఎగ్జైట్ చేశారు.  కానీ కొరటాల శివ మాత్రం మౌనం వహించారు.  కొరటాల శివ తర్వాత సినిమా ఎన్టీఆర్ తోనే.  గతంలో వీరి కలయికలో ‘జనతాగ్యారేజ్’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది.  
 
కొరటాల మీదున్న నమ్మకంతోనే తారక్ ‘ఆర్ఆర్ఆర్’ తరవాత సినిమాను ఆయనతో ప్లాన్ చేసుకున్నారు.  ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.  ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కొరటాల శివ ఏదైనా విశేషం చెబుతారేమోనని ఆశపడ్డారు.  షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, సినిమా ఎలా ఉండబోతుంది లాంటి అప్డేట్ ఏదైనా వస్తుందని ఆశించారు.  కానీ ఏదీ రాలేదు.  మొత్తంగా కొరటాల శివ మౌనం వహించారు.  ఇది తారక్ అభిమానులకు అస్సలు మింగుడు పడట్లేదు.  కన్ఫర్మ్ అయిన సినిమా మీద కూడ ఇలా మౌనం ఎందుకు అనుకుంటున్నారు.