Kajal Aggarwal : ఆచార్య: అప్పుడు త్రిష, ఇప్పుడు కాజల్.!

Kajal Aggarwal : సహజంగానే సినిమాల్లో హీరోయిన్ల విషయంలో మొదట అనుకున్నప్పటికీ, ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేసరికీ కొన్ని కొన్ని మార్పులూ, చేర్పులూ జరుగుతుంటాయ్. ఇటీవల ‘ఆచార్య’ సినిమా విషయంలో అలాగే జరిగింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను అనుకున్నారు.
అనుకోని కారణాలతో ఆమె స్కిప్ అవ్వగా, ఆ ప్లేస్‌లోకి కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. తాజాగా ఈ సినిమా నుంచి కాజల్‌ని కూడా తప్పించడం జరిగింది. దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి పాత్ర నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో వుంటుంది.
నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి ప్రేమతో ముడి పెట్టడం బాగోదు కదా.. ఏదో ఒక హీరోయిన్ వుండాలి.. అని బలవంతంగా ఆ పాత్రను ఇరికించి అన్యాయం చేయడం మంచిది కాదని కాజల్ పాత్రను సినిమా నుంచి తొలగించాల్సి వచ్చిందని డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశారు.
ఇదే విషయమై కాజల్‌కి అర్ధమయ్యేలా చెప్పారట ఆయన. కాజల్ అర్ధం చేసుకుని, మిమ్మల్ని మిస్ అవుతున్నా.. కానీ, తప్పకుండా భవిష్యత్తుల్లో మళ్లీ మీతో కలిసి సినిమా చేయాలని వుందని తన కోరికను కొరటాల ముందు పెట్టిందట. కొరటాల శివ కూడా కాజల్‌కి హామీ ఇచ్చారట. అలా ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు హీరోయిన్ లేదని తేలిపోయింది.
సో, ‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్దే మాత్రమే సోలో హీరోయిన్ అయిపోయింది. రామ్ చరణ్ పాత్రకు జోడీగా పూజా హెగ్దే నటిస్తోంది.  కాగా, సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో నటించారు. సురేఖ కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.