ఏపీ సీఎం జగన్.. ఎప్పుడైతే తిరుమల పర్యటన ఖరారు చేశారో… వెంటనే తిరుమల డిక్లరేషన్ అంశం తెరమీదికి వచ్చింది. దీనిపై చర్చోపచర్చలు సాగాయి. ఏపీ మొత్తం డిక్లరేషన్ గురించే మాట్లాడింది. జగన్.. తిరుమలకు వెళ్లడం అయిపోయింది.. ఆయన తిరిగి రావడం కూడా జరిగింది. కానీ.. ఈ డిక్లరేషన్ వివాదం మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నది.
సీఎం జగన్.. తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్లారు.. వచ్చారు. అయితే.. సీఎం జగన్.. తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వాలంటే ఆయన్ను ఎవరూ అడగలేదా? డిక్లరేషన్ గురించి అక్కడ ఎందుకు ఎవ్వరూ మాట్లాడలేదు. కనీసం టీటీడీ అధికారులు కూడా దీనిపై సీఎంతో మాట్లాడలేదా? అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
అయితే.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం… తిరుమల ఆలయంలో అసలు డిక్లరేషన్ గురించే చర్చ జరగలేదట. జగన్ ను డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఎవ్వరూ అడగలేదు.. అక్కడ డిక్లరేషన్ అంశమే ప్రస్తావనకు రాలేదు.. అంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
మరి.. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి? దాని మాటేమిటి.. అది కూడా వైసీపీ నేతల వల్లే జరిగిందంటూ కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి.
మరోవైపు అసలు డిక్లరేషన్ వివాదాన్ని లేపిందే ఎల్లో మీడియా అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివాదానికి తెర తీసి.. ఎలాగైనా జగన్ తిరుమల పర్యటనను ఆపేయాలన్న ఉద్దేశంతో డిక్లరేషన్ వివాదాన్ని ఎల్లో మీడియా తెర మీదికి తీసుకొచ్చిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
అయితే.. డిక్లరేషన్ పై ఎన్ని వివాదాలు వచ్చినా.. ఎన్ని అభ్యంతరాలు చెలరేగినా.. జగన్ మాత్రం తన మౌనంతోనే ఎల్లో మీడియాకు చెక్ పెట్టారని.. తన పని తాను చేసుకొని వచ్చారని.. దీంతో ఎల్లో మీడియా దిమ్మ తిరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.