అసలు సిసలు ‘టైగర్’ ఎవరు.?

ఒకే వ్యక్తి బయోపిక్.. రెండు సినిమాలుగా తెరకెక్కతోంది. ఇందులో ఎవరు ఒరిజినల్.? ఎవరు డూప్లికేట్. అతనో గజదొంగ.. కానీ, మంచోడట. ఆ గజదొంగ తాలూకు బయోపిక్ తీయడానికి తెలుగులో ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. ఒకరు యంగ్ హీరో, ఇంకొకరు సీనియర్ హీరో.

‘టైగర్ నాగేశ్వరరావు’ పేరుతో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన ఇటీవల వచ్చింది. రవితేజ చేస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఇంకోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ పేరుతో మరో సినిమా వస్తోంది.

రెండు సినిమాలూ గజదొంగ ‘నాగేశ్వరరావు’ బయోపిక్‌గానే వస్తుండడం గమనార్హం. వీటిల్లో ఏది ఒరిజినల్.? ఏది డూప్లికేట్.? అంటే, రెండూ ఒరిజినల్ కథలే. కాదు కాదు, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలే.

నిజానికి, బెల్లంకొండ ముందుగా ఈ కథపై ఆసక్తి చూపాడు. ఆ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడయ్యింది కూడా. మధ్యలోకి వచ్చింది రవితేజ. సో, ఎవరి సినిమాలో కథ ఆకట్టుకుంటుంది.? అన్నది వేచి చూడాల్సిందే. బెల్లంకొండ అయితే, శరవేగంగా సినిమా చేసే అవకాశాలున్నాయట.

రవితేజ మాత్రం, ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి, ‘టైగర్’ వరకు రావాలంటే కొంత టైమ్ పట్టొచ్చు.