మహేష్ బాబును పేరు పెట్టి పిలిచిన లేడీ డైరెక్టర్… ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో లేడి దర్శకురాలు అంటే అందరికీ టక్కున డైరెక్టర్ నందిని రెడ్డి గుర్తుకు వస్తారు.గత కొంత కాలం నుంచి ఈమె లేడీ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో విభిన్నమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం మరి కొందరు లేడి డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.కానీ నందిని రెడ్డి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నందినిరెడ్డి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నందిని రెడ్డి మహేష్ బాబు గురించి మాట్లాడుతూ తాను కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేటప్పుడు ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు మురారి సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ షాట్ రెడీ అని పేరు పెట్టి పిలిచాను. నేను ఇలా మహేష్ బాబును పేరు పెట్టి పిలవడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక షాట్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు తన వద్దకు వచ్చి ఏంటి మహేష్ అని పేరు పెట్టి పిలుస్తున్నారని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మహేష్ అలా అడగడంతో బాబు బేబీ అని పిలవాలా? అని నేను అనగా ఒక్క సారిగా మహేష్ బాబు ఫక్కున నవ్వారు.అలా అప్పటి నుంచి మహేష్ బాబుతో నాకు ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని నందిని రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.ఆయనకు పెద్ద హీరో అనే గ్రాట్యూటీ లేదని మహేష్ డౌన్ టు ఎర్త్ అంటూ నందిని రెడ్డి మహేష్ బాబు గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అల్లు అర్జున్ హీరోలందరినీ పేర్లు పెట్టే పిలుస్తానని ఒక ప్రభాస్ ని మాత్రమే ప్రభాస్ గారు అని పిలుస్తానని నందిని రెడ్డి వెల్లడించారు.