పుష్ప 2 లో ఆ హీరోయిన్ తో ఊ అంటావా మ్యూజిక్ క్రియేట్ చేయనున్న దేవి?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎలాంటి ప్రేక్షకాదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సమంత నటించిన ఐటెం సాంగ్ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఇలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులను సృష్టించడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప పార్ట్ 2 రానుంది. ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఇకపోతే పుష్ప సినిమాలో రష్మిక అల్లు అర్జున్ జంటగా నటించగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని ఈ పాత్రలో నటించడం కోసం మరో హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ హీరోయిన్ గురించి అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే సెకండ్ హీరోయిన్ తో పాటు పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం మరొక క్రేజీ హీరోయిన్ దిశా పటానిను రంగంలోకి దింపుతున్నటు తెలుస్తోంది. పుష్ప2 సినిమాలో దిశా పటాని ఐటం సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.