Chiranjeevi: ఇండస్ట్రీ పెద్ద గా ఉండనని చెప్పడానికి చిరంజీవి ఎవరు.. తమ్మారెడ్డి భరద్వాజ్!

Chiranjeevi: చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండను అని అనడానికి ఆయనెవరు అని నిర్మాత & డైరెక్టర్ భరద్వాజ అన్నారు. ఆయన తనకు దేవుడని, అది కాదు అనడానికి ఆయనెవరు ? అది నా ఇష్టం. దేవుడు అనుకుంటానని, భరద్వాజ తెలిపారు. అలాగే పెద్ద నేను కాదు అని చెప్పడానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. ఆయనకంటే ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు కృష్ణ, కృష్ణం రాజు లాంటి వాళ్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ వయసు పైబడింది. కాబట్టి ఇప్పుడున్న వాళ్లలో ఈయన పెద్ద అని భరద్వాజ చెప్పుకొచ్చారు. అలాంటి వాళ్లలో చూసుకుంటే మోహన్ బాబు, బాలకృష్ణ కూడా ఉంటారని, వాళ్ల పెద్దరికం సంగతి వచ్చినప్పుడు వాళ్ల గురించి మాట్లాడతాను అని ఆయన చెప్పారు.

అలా చెప్పాల్సివస్తే వెంకటేష్, నాగార్జున వీళ్లు కూడా ఉన్నారు కదా ? మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదు ? కేవలం మోహన్ బాబు గురించి ఎందుకు చెప్తున్నారని భరద్వాజ అన్నారు. ప్రతీ మా ఎలక్షన్స్ లోనూ వారిద్దరి మధ్య ఇలాగే జరుగుతుందని ఆయన చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఇంకా పెద్దది చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఉన్నా కూడా ఈ దేశానికి గానీ, ప్రపంచానికి గానీ ఏమైనా నష్టం ఉందా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

చిరంజీవి గారు ఏమన్నారంటే తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ ఏమైనా అవసరం వస్తే మాత్రం సహాయం చేస్తానని అన్నారు. అలాగే మోహన్ బాబు గారు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుని ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు తను కూడా సహాయం చేస్తానని అన్నట్టని ఆయన మరోసారి గుర్తు చేశారు. అది అంతటితో అయిపోయింది. ఇక వీరిద్దరి మధ్య పేచీ ఉన్నట్టు ఎలా అవుతుందని ఆయన అన్నారు. సినీ ఇండస్ట్రీ ఇలా అనుకుంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ అంటే ఎవరు ? పలానా వ్యక్తి అని ఉండాలి కదా? అసలు ఎవరూ దాని గురించి అలా అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళిద్దరూ కూడా సహాయం చేస్తాననే చెప్పారు. ఇంకా ఎందుకు గొడవ అని ఆయన మరోమారు ప్రశ్నించారు.