బన్నీకి ‘ఐకాన్ స్టార్’ బిరుదు ఎవరిచ్చారబ్బా ?

Who gave ICON STAR tag to Allu Arjun

Who gave ICON STAR tag to Allu Arjun

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కొక బిరుదు ఉంటుంది. మెగాస్టార్ అంటే చిరు, పవర్ స్టార్ అంటే పవన్, సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు, నాచ్యురల్ స్టార్ అంటే నాని.. ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరోకు ఒక ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్స్ ఇప్పటవి కావు. దశాబ్దాల క్రితమే ఈ ట్యాగ్స్ మొదలయ్యాయి. ఒకప్పుడు హీరోలకు ఈ ట్యాగ్స్ కళా సమితులు ఇచ్చేవి. లేకపోతే లెజెండరీ దర్శకులు లేదా నిర్మాతలు హీరోలకు అలాంటి బిరుదులను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ బిరుదులు ఎవరిస్తున్నారో ఎందుకిస్తున్నారో తెలియట్లేదు.

తాజాగా అల్లు అర్జున్ ట్యాగ్ మారింది. ఇన్నాళ్లు స్టయిలిష్ స్టార్ అనే ట్యాగ్ మోసిన బన్నీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నారు. బన్నీకి స్టయిలిష్ స్టార్ ట్యాగ్ ఇచ్చింది అభిమానులే. అందుకో కారణం ఉంది. బన్నీ స్టయిల్స్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తుంటారు. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తాడు. బయట కూడ ఇంటర్నేషనల్ లెవల్ ఫ్యాషన్ ట్రెండ్స్ మెయింటైన్ చేస్తుంటాడు. కాస్ట్యూమ్స్ నుండి హెయిర్ వరకు కొత్త కొత్త స్టయిల్స్ చూపించాలంటే ఇండస్ట్రీలో బన్నీ తర్వాతే ఎవరైనా. ఇది ఒప్పుకుని తీరాల్సిన నిజం. అందుకే ఫ్యాన్స్ ఆయనకు స్టయిలిష్ స్టార్ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు.

కానీ ఇప్పుడేమో దాన్ని తీసేసి ఐకాన్ స్టార్ ట్యాగ్ పెట్టుకున్నారు బన్నీ. మరి ఐకాన్ అని పిలిపించుకునేలా బన్నీ ఏం చేశాడు, ఏ కాంటెక్స్ట్ కింద ఆయనకు ఆ బిరుదు వచ్చింది, ఇంతకీ ఆ ట్యాగ్ ఎవరు వేశారు అనేవే అర్థంకాని ప్రశ్నలుగా కొడుతున్నాయి ప్రేక్షకులకి.