Which Megastar : తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అంటే చిరంజీవి. మలయాళంలో మమ్ముట్టిని మెగాస్టార్ అంటుంటారు. హిందీలో అయితే అమితాబ్ బచ్చన్. నిజానికి, మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమేనని.. పలు సందర్భాల్లో అమితాబ్ బచ్చన్ కూడా చెప్పారు.
ఇప్పుడీ మెగాస్టార్ చిరంజీవి గురించిన వివాదమెందుకంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘కొమరం పులి’ సినిమాలో నటించిన నికీషా పటేల్, ‘మెగాస్టార్ ఎవరు..?’ అని ప్రశ్నించడం వల్లనే.. ఈ వివాదం తెరపైకొచ్చింది.
అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకున్న నికీషా, పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అభిమానులు అడిగిన ఒక్కో ప్రశ్నకూ సమాధానమిచ్చే క్రమంలో, ‘చాలామంది మెగాస్టార్లు వున్నార.. మీరు ఏ మెగాస్టార్ గురించి అడుగుతున్నారు.?’ అని ఓ అభిమాని ప్రశ్నకు ఎదరు ప్రశ్న వేసింది నికీషా పటేల్.
అంతే, ‘మెగాస్టార్ అంటే తెలియదా.? తెలుగు సినిమాల్లో నటించావ్.. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడైన పవన్ కళ్యాణ్ సినిమాతో తెరంగేట్రం చేశావ్.. చాలామంది మెగాస్టార్లున్నారని ఎలా అంటావ్.?’ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
నిజానికి, నికీషా పటేల్‌కి వివాదాలు కొత్తమే కాదు. గతంలో పవన్ కళ్యాణ్ పేరుతో హ్యాష్ ట్యాగ్ వేసే క్రమంలో తప్పుడు హ్యాష్ ట్యాగ్ వేసి వివాదాల్లోకెక్కింది. అయితే, అది ఆమె అనుకుని చేసింది కాదు. మెగాస్టార్ విషయంలో మాత్రం కావాలనే నికీషా ‘ఏ మెగాస్టార్’ అని ప్రశ్నించిందనే అనుకోవాలి.