దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా నటించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఎంతగా గుర్తింపు పొందారు అంటే ఈ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ చేయకపోతే ఆ పాత్రకు మరెవరు సెట్ కారు అనేలా ఈయన పేరు సంపాదించుకున్నారు. ఇలా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ముందుగా కె.బాలచందర్ దర్శకత్వంలో నటించారు అనే విషయం మనకు తెలిసిందే.
ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ లోకి రాకముందు నాటకాలు వేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే తన స్నేహితులు ఎంతో మంచి టాలెంట్ ఉంది ఒకసారి వెళ్లి భాలచందర్ గారిని కలవచ్చు కదా అని సలహా ఇచ్చారు. స్నేహితుడు పెళ్లి కోసం చెన్నై వెళ్లిన ప్రకాష్ రాజ్ అతని అపాయింట్మెంట్ తీసుకొని బాలచందర్ ను కలిసారు. ఇక బాలచందర్ ను కలసిన ప్రకాష్ రాజ్ తన నాటకాల గురించి తెలియజేశారు. ఈ విధంగా బాలచందర్ ప్రకాష్ రాజ్ ను చూసిన తర్వాత అతని కళ్ళల్లో ఏదో ఫైర్ వుందని ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నావు అంటూ అతనిని ప్రశంసించారు.
ఈ క్రమంలోనే బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన డ్యూయట్ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించారు. ఇక ఈ సినిమాలో శరత్‌బాబు ఇంట్లో మెట్ల మీదనుంచి కిందికి దిగుతూ, ప్రకాశ్‌రాజ్‌ను చూసి “ఎవర్నువ్వు?” అనడుగుతారు. “నా గురించి నీకు తెలీదా, పెద్ద నటుడ్ని” అని డైలాగ్ చెప్పారు ప్రకాశ్‌రాజ్. ఈ విధంగా ఇతను చెప్పిన డైలాగ్ డెలివరీ చూసి వెంటనే బాలచందర్ గాలిలేని చోట కూడా నా పేరుంటుంది. నా పేరు శిర్పి అని డైలాగ్ మార్చి రాశారట. ఇది ఏంటి సార్ ఇలా డైలాగ్ మార్చారు అని ప్రకాష్ రాజ్ అడగడంతో అది నీ ఫ్యూచర్ రా అని ఆరోజు ప్రకాష్ రాజ్ పై బాలచందర్ ప్రశంసలు కురిపించారు. ఇక అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.