మెగా వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ జూన్ 14వ తేదీ తన పదవి వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.తన భార్య ఉపాసనతో కలిసి ఇటలీలో ఈ వేడుకను రామ్ చరణ్ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ప్రేమించుకొని 2011 జూన్ 14వ తేదీ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లి జరిగి పది సంవత్సరాలు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున ఈ వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. వివాహం తర్వాత వృత్తిపరమైన జీవితాలలో ఎంతో బిజీగా ఉంటూ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట అందరికీ ఆదర్శం అని చెప్పాలి. వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట ఇప్పటివరకు పిల్లల గురించి ఆలోచించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరికి ఇప్పటివరకు పిల్లలు లేకపోవడం గురించి పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక ఈ జంట ఇప్పటివరకు పిల్లలు గురించి ఆలోచించక పోవడానికి ఒక బలమైన కారణం ఉంది.ఉపాసన ఈ విషయం గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోందని ఇప్పుడే తను కాస్త బరువు తగ్గాను, మరి గర్భం దాల్చడం గురించి తనకు పలు భయాందోళనలు ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు పిల్లల గురించి ప్లాన్ చేస్తామని ఆ సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని ఈమె తెలియజేశారు.ఇక పోతే రామ్ చరణ్ సైతం మెగా అభిమానులను సందడి చేసే విషయంలో తనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయని పిల్లలు ఉంటే తన లక్ష్యాన్ని చేరుకోలేకపోతానని, అందుకే ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నట్లు తెలిపారు. వీరి కెరియర్ పరంగా ముందుకు వెళ్లడం కోసమే పిల్లలను ఇప్పుడే వద్దనుకుంటున్నట్లు తెలుస్తుంది.