గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

ప్రస్తుతం ఇండియా లో టాప్ సూపర్ స్టార్ గా ఉన్నాడు సల్మాన్ ఖాన్. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోయినా కానీ సల్మాన్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన షారుఖ్ ఖాన్ పది సంవత్సరాల పై నుండి కనీసం ఒక్క హిట్ కూడా లేదు. సినిమా ప్లాప్ అయినా కానీ సల్మాన్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే ‘బిగ్ బాస్’ హోస్ట్ గా కూడా సల్మాన్ ఖాన్ క్రేజ్ ఇంకా పెరిగింది.

అంత క్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్ ని పాన్ ఇండియా అప్పీల్ కోసం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ రోల్ కోసం సల్మాన్ ఖాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా అని చర్చలు మొదలయ్యాయి

దీని పై చిరంజీవి తాజాగా ఒక క్లారిటీ ఇచ్చాడు.  ఈ సినిమాకి  సల్మాన్ అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదని చిరంజీవి అన్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, సినిమాల మీద మాకు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ప్రేమ వల్లనే గాడ్ ఫాదర్ మూవీలో వర్క్ చేసాను అని అన్నాడు. మూవీని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్.