టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తర్వాత విశాఖ కంచుకోటగా గెలిచేది అవంతి శ్రీనివాసరావు. ప్రస్తుతం వైకాపా లో మంత్రిగా పనిచేస్తున్నారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు షాకిచ్చి ఫ్యాన్ గాలికిందకొచ్చారు. భీమిలి నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిసి వైకాపాలో మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. విశాఖని ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ చేయడంలో అవంతి పాత్ర ఎంతో కీలకమైనది. వైజాగ్ రాజధాని అయితే ఉత్తరాంధ్రా ప్రజలు వలసలు వెళ్లి ఎక్కడో బ్రతకాల్సిన పనిలేదని…వైజాగ్ లోనే కావాల్సిన ఉపాధి దొరుకుతుందని వైకాపాతో కలిసి నడుస్తున్నారు.
విశాఖ ఒక సామాజిక వర్గమే అధికం కాబట్టి అవంతికి అక్కడ తిరుగులేదు. ఆ కాన్ఫిడెన్స్ తో నే పవన్ కళ్యాణ్ కూడా గాజువాక నుంచి పోటీ చేసారు. కానీ అప్పటికే వైకాపా నేత తిప్పల నాగిరెడ్డి తిష్ట వేసి స్థానికంగా బలమైన నేతగా ఎదగడంతో పవన్ చతికిల పడాల్సి వచ్చింది. లేదంటే గాజువాక పవన్ ఎగరేసుకుపోవడం ఖాయమని బలమైన ఊహాగానాలొచ్చాయి. అయితే అవంతి రాజకీయం జీవితం ప్రారంభమైంది చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే. అటుపై కాంగ్రెస్, తెలుగు దేశం, వైసీపీల దాకా సాగింది. ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనమైన తర్వాత ఆయన తీసుకున్న టర్నింగ్ లివి. అలా అంచలంచెలుగా ఎదిగి రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమై గుర్తింపును సంపాదించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఇప్పుడు మంత్రిగాను కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ, విశాఖ జిల్లాలను ఆయనకున్న మంచి పేరు కారణంగా అనతి కాలంలోనే ఇవన్నీ సాధించగలిగారు. అయితే ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొంత మంది విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అవంతిపై తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా మెగా బ్ర్రదర్ నాగబాబు కూడా అవంతిపై అక్కసం వెళ్లగక్కాడు. అవంతి ఆవుకు ఎండిగట్టి వేస్తోన్న ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయింది. దాన్ని చూసిన నాగబాబు అన్ని పశువులు గడ్డి తినవు శీను అంటూ ట్వీట్ చేసారు. దీంతో అవంతి వర్గం నాగబాబుపై ప్రతి దాడి మొదలు పెట్టింది. అవంతి ఎదుగుదలను ఓర్వలేక ఇలా చిల్లర కామెంట్లు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జాతిపిత గాంధీని చంపిన గాడ్సేని వెనకేసుకొచ్చిన నాగబాబు అంతకన్నా ఏం తెలుసంటూ మండిపడ్డారు.