టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసింది. అయితే వయసు పై పడటంతో ఇలాంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అయితే నిన్న రాత్రి రెండు గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన హెల్త్ బుల్లెట్ విడుదల చేశారు.
నిన్న రాత్రి రెండు గంటల సమయంలో కృష్ణ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు అన్ని పరీక్షలను నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం కృష్ణ గారిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించనున్నట్లు వైద్యులు తెలియజేశారు.
ఈ విధంగా కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడంతో ఇప్పటికే కృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ చేరుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించడంతో కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక మహేష్ బాబు కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదన చెందారు. ఇప్పుడిప్పుడే తన తల్లి మరణ వార్త నుంచి బయటపడిన మహేష్ తన సినిమా షూటింగులతో బిజీ కానున్న నేపథ్యంలో మరోసారి కృష్ణకు తీవ్రమైన అనారోగ్య సమస్య రావడంతో ఈయన కూడా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం.