తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడాడు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనే చర్చ నడుస్తుంది అని అన్నాడు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పు పుట్టని స్థితికి తెచ్చారు అని.. ఢిల్లీలో కూడా ఇదే అభిప్రాయం ఉందని అన్నాడు. ఇక తాము ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఉంది అని.. జనసేన, భాజపా కలిసి జనాల్లోకి వెళ్తామని అన్నాడు.
ఇక ముందస్తు ఎన్నికల గురించి ఇప్పుడేమీ చెప్పలేమంటూ.. తన అభిప్రాయాలను భాజపా పెద్దలకు వివరిస్తానని అన్నాడు. ఇక పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలు స్థిరత్వం చూస్తాయని.. స్థిరత్వం లేనప్పుడు ఎన్ని పర్యటనలు చేసినా ప్రయోజనం ఉండదని అన్నాడు. అంతేకాకుండా కాగితాల మీద సంతకాలు పెడితే పరిశ్రమ పెట్టినట్లు కాదని.. నేను ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడిస్తామన్న వారి సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ.. ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదు అని తెలిపాడు.