Akhanda Movie: అల్లు అర్జున్ వచ్చినా, సుకుమార్ వచ్చినా కడిగి పారేస్తా… అని ఇటీవల భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పుష్ప సినిమా గురించి గరికపాటి గారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక హీరోని హీరోగా చూపించకుండా ఒక స్మగ్లర్‌గా చూపిస్తూ సమాజానికి మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారా అని ఆయన ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాశీ వాసులు అఘోరా వైఎస్ బాలకృష్ణ స్పందించారు.
గరికపాటి నరసింహారావు గారు అన్న మాటలపై చర్చించడానికి తాను గొప్ప వ్యక్తినైతే కాదని, కాకపోతే సినిమాను సినిమాలానే చూడాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అది ఎంటర్‌టైన్‌మెంట్ కోసమేనని, ఒకప్పటి సినిమాల్లోనూ రౌడీయిజం, గూండాయిజం అనేవి ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కానీ సినిమా చూసేటపుడు మనం టాక్స్ కూడా కట్టి చూస్తామని, అదే ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ అని, అది రెండు లేదా 3 గంటల వరకేనని, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసేయాలని ఆయన చెప్పారు.
ఇక ఇప్పుడు ఆయన అన్నట్టు సమాజానికి ఏం మంచి చూపిస్తున్నారు అని.. మన చేతి వేళ్లే సమానంగా ఉండవు.. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలోని వారే సమానంగా ఉండరు.. సినిమా చూసి చెడిపోతున్నారు అంటే తప్పు చెడిపోయిన వాడిదా, సినిమా తీసినవాడిదా, లేదంటే సినిమా చూసిన వాడిదా అని ఆయన ప్రశ్నించారు. సినిమా చూస్తున్నపుడు దానిలో ఉన్న సన్నివేశానికి లోబడి చెడిపోతే తప్పు తనదే అవుతుంది అని, అది సినిమా తీసినవాళ్లదో, చేసిన వాళ్లదో కాదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే సినిమాను సినిమాలాగా చూసి వదిలేస్తానని అంటే అసలు ఈ టాపికే రాదని ఆయన చెప్పారు. అలా కాకుండా దానిలో ఉన్న గూండాయిజాన్ని చూసి ఇన్స్‌పైర్ అయ్యి, తాను కూడా గూండాయిజం చేస్తానంటే చూసిన వాడిదే తప్పు అని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. అలాంటి సినిమాలు రావడం ఇదేం కొత్త కాదన్న ఆయన, చివర్లో మంచి అనేది 2 నిమిషాలు చెప్తారా, 20 నిమిషాలు చెప్తారా అనేది పాయింట్ కాదని, సినిమా అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుందని ఆయన అన్నారు.
ఇంత మంది ఇన్ని సినిమాలు చూస్తున్నారు అందరూ అలాగే చెడిపోతున్నారా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అలా కావట్లేదంటే వాళ్లు సినిమాను సినిమాలాగా చూస్తున్నారని ఆయన చెప్పారు. ఇక అది యువతపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు గానీ, ఇప్పుడు యూట్యూబ్‌లో అంతకన్నా బండ బూతులు ఉంటున్నాయి అది తప్పు కాదా, రాజకీయ నాయకులు ఎంతో తిట్టుకుంటున్నారు అది టీవీల్లో చూపించట్లేదా,… వాటిని చూసి నేర్చుకోరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాబట్టి సినిమాను సినిమాలాగా చూసి వదిలేయాలని ఆయన స్పష్టం చేశారు.