ఇది నిజానికి ఓ సినిమా స్టోరీనే తలపిస్తోంది. ఓ చిన్న ఘటన ఓ ప్రాణాన్ని తీసేసింది. నర్సు అత్యుత్సాహం.. వార్డ్ బాయ్ భయం.. రెండూ కలిసి ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో చోటు చేసుకున్నది.
పర్బని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తన్న వార్డ్ బాయ్ సచిన్ ను అదే ఆసుపత్రిలో పని చేసే నర్సు రోజూ వేధించేది. అది కూడా లైంగికంగా. సచిన్ పైన మోజు పెంచుకున్న ఆ నర్సు.. ఆసుపత్రిలో ఎవరూ లేని సమయంలో.. స్ట్రెచర్ పైన పడుకొని ఆ పని చేద్దామంటూ విసిగించేది.
ఆ వార్డు బాయ్ కి నర్సంటే అస్సలు ఇష్టం లేదు. దీంతో.. చాలాసార్లు ఆమె నుంచి తప్పించుకున్నాడు. వద్దంటూ వారించాడు. అయినా తను వినలేదు.
అనారోగ్యంతో తన భర్త మరణించడంతో.. తన వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. చాలా ఏళ్ల నుంచి ఈ నర్సు వేధింపులను తట్టుకోలేకపోయాడు వార్డు బాయ్.
ఇలా అయితే తన మాట వినడు.. ఇతడికి ఏదో ఒకటి చేయాలి.. అని అనుకున్నదో ఏమో నర్సు.. నువ్వే నన్ను లైంగికంగా వేధిస్తున్నావంటూ రివర్సులో కేసు పెడుతా.. అని వార్డు బాయ్ ని బెదిరించడం ప్రారంభించిందట. నా దగ్గర పడుకుంటావా? లేక అరెస్ట్ చేయించనా? నువ్వు అరెస్ట్ అయితే నీ జాబ్ కూడా పోతుంది.. అంటూ బెదిరింపులకు దిగిందట.
అయితే.. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆ వార్డు బాయ్.. తన ఉద్యోగం పోతే ఎలా బతకాలి.. అని చాలా రోజుల నుంచి మథన పడుతున్నాడు. ఈనేపథ్యంలో.. చాలా డిప్రెషన్ కు లోనయి.. ఇంట్లో భార్య కూరగాయలకు వెళ్లిన సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన ఆత్మహత్యకు ముందు.. నర్సుతో జరిగిన తతంగాన్నంతా లేఖ రాసి పెట్టాడు. దీంతో లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నర్సును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.