దర్శకులు హీరోలుగా మారడం అనేది చాలా రేర్ ఫీట్. దీన్నే చేసి చూపిద్దాం అనుకున్నారు వి.వి.వినాయక్. నిర్మాత దిల్ రాజు ఇచ్చిన ప్రోత్సాహంతో హీరోగా మారాలనే బీజం పడింది వినాయక్ మనసులో. ‘శీనయ్య’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. జిల్, డైట్ వగైరాలు చేసి బాగా బరువు తగ్గారు. స్లిమ్ లుక్ తెచ్చుకుని ఫస్ట్ లుక్ పోస్టర్లు వదిలారు. వినాయక్ హీరో అంటే జనం కూడ కాస్త ఆసక్తి చూపించారు. కానీ ఉన్నట్టుండి సినిమా ఆగిపోయింది. హీరో కావాలన్న వినాయక్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుండి ఆయన మనసులో హీరో ఇమేజినేషన్ తీరని కోరికలా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కోరిక తీరే మార్గం దొరికినట్టు కనిపిస్తోంది.
అది కూడ పవన్ కళ్యాణ్ సినిమా రూపంలో కావడం విశేషం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ చేస్తున్నారు. ఇందులో వినాయక్ ఒక కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో కొన్ని కీలకమైన పోలీస్ పాత్రలు ఉంటాయి. వాటిలో ఒక దాన్ని వినాయక్ చేయనున్నారట. ఇదే గనుక నిజమైతే హీరో అవ్వాలనే వినాయక్ కోరిక కొంతైనా తీరుతుంది. మరోవైపు వినాయక్ తెలుగు ‘ఛత్రపతి’ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. నిజానికి ఆయన చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు.