లాక్ డౌన్ మూలంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా సినిమా హాళ్లు మూతబడ్డాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రమే చివరి సినిమా. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో థియేటర్ యాజమాన్యాలే సినిమా హాళ్లకు స్వచ్ఛందంగా క్లోజ్ చేశాయి.
ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల సంగతేమిటినే ప్రశ్న మొదలైంది. ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా సినిమా హాళ్లు తెరవడం మీద దృష్టి పెట్టలేదు. అన్నీ చక్కబడ్డాక తెరుచుకోండి అన్నట్టే ఉన్నాయి. అందుకే యాజమాన్యాలే ముందడుగు వేశాయి.
ధైర్యం చేసి సినిమా హాళ్లను తెరిచాయి. వైజాగ్ సిటీలోని ప్రధాన థియేటర్ జగదాంబను ఈరోజు ఓపెన్ చేశారు. సెంకండ్ వేవ్ లాక్ డౌన్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న తొలి థియేటర్ ఇదే కావడం విశేషం. రవితేజ సూపర్ హిట్ మూవీ ‘క్రాక్’తోనే ఇది ఓపెన్ కావడం విశేషం.
ఈరోజు 50 శాతం ఆక్యుపెన్సీతో మార్నింగ్ షో వేయడంతో జరిగింది. ఈ షోకు వచ్చే స్పందనను బట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటానికి సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయం మీద ఒక అంచనా వస్తుంది.