నిన్న టాలీవుడ్ లో ఓ షాకింగ్ ప్రెస్ మీట్ అయితే సంచలనంగా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా దర్శకునిగా తన కూతురిని కూడా హీరోయిన్ గా పరిచయం చేస్తూ మొదటి సినిమాని తాను అనౌన్స్ చేశారు.
మరి దీనిని అయితే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి లాంచ్ చెయ్యగా నిన్న షాకింగ్ వార్తలు బయటకి వచ్చాయి. విశ్వక్ సేన్ సినిమా నుంచి తప్పుకున్నాడని పలు వార్తలు రాగా ఇది నిజమే అని సంచలన ప్రెస్ మీట్ పెట్టి అర్జున్ విశ్వక్ సేన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
నా లైఫ్ లో ఎవరికీ కూడా ఇన్ని సార్లు కాల్ చెయ్యలేదని విశ్వక్ తో ఎవరు సినిమా చెయ్యొద్దని కామెంట్స్ చేసి ఈ సినిమా ఆపేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మరి దీనికి విశ్వక్ దగ్గర బలమైన సమాధానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తాను ఓకే చేసాక తనకి సెట్స్ లో ఎలాంటి మర్యాద కనిపించేది కాదని..
ప్రతి సారి కూడా ఇలాగే ఉండేది అని ఆరోపించాడు అంతే కాకుండా అర్జున్ కి కథలో కొన్ని మార్పులు చేయమని అడిగితె తాను ఒక్కటి కూడా చేసేందుకు ఒప్పుకోలేదని ఇక ఇవన్నీ తన వల్ల కాదని వారి సినిమా నుంచి బయటకి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ఈ ఇద్దరి సినిమా కాంట్రవర్సీ టాలీవుడ్ లో సంచలనంగా మారింది.