Vishwak Sen: రెండు రోజులే టైముంది.. ఒక మంచి సంబంధం వెతికి పెట్టండి అంటున్న యంగ్ హీరో!

Vishwak Sen: వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్‌, హిట్‌, పాగల్‌ చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ యంగ్ హీరో ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ హీరో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో వడ్డీ వ్యాపారవేత్త అర్జున్ కుమార్ గా సందడి చేస్తున్నట్లు మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయనకు పెళ్లి కాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అనే విషయం గురించి మనకు వివరించారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు. ఇందులో అర్జున్ కుమార్ పెళ్లి కాక ఎంతో సతమతమవుతుంటారు. ఈ సందర్భంగా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది కనీసం సంబంధమైన వెతికి పెట్టండి లేదా పిల్లని అయినా చూడండి లేదా… ఒక అమ్మాయిని ఎలా పడేయాలో టిప్స్ ఇవ్వండి అంటూ #HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో మీ సూచనలు తెలియజేయండి’ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం రెండు రోజులు మిగిలి ఉందని చెప్పడంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు రోజులే ఉందని చెప్పడంతో ఈ సినిమా నుంచి ట్రైలర్ లేదా పాటలు ఏవైనా విడుదల చేస్తారా.. లేకపోతే అర్జున్ కుమార్ కు పిల్లలను వెతికి పెట్టి హీరోయిన్ ఫోటో విడుదల చేస్తారా… అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించగా..వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో తన తనయుడు బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.