Vishwak Sen: బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన విశ్వక్ సేన్..!

Vishwak Sen: ఇదివరకు బుల్లితెర మీద ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం ఓటీటీ లో నాన్ స్టాప్ గా ప్రసారమవుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో 10 వారాలు పూర్తి చేసుకొని గ్రాండ్ ఫినాలే కు చేరువలో ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా ఉంది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు బిగ్బాస్ లో సందడి చేసే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం టీమ్ కూడ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ తో పాటు ఇద్దరు హీరోయిన్లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా వీరు ఇంటి సభ్యులతో ఎంతో సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో ఎంతో సరదాగా ఉంది. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మేము సినిమా ప్రమోషన్స్ కోసం రాలేదు ఆల్రెడీ సినిమా హిట్ అయింది అంటూ సరదాగ మాట్లాడాడు. ఈ క్రమంలో శివ బ్రాందీ తగుతాడా లేక విస్కీ తాగుతాడ అంటూ సరదా ప్రశ్నలు వేసాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కథానాయకులలో ఒకరు అడిగిన ప్రశ్నకు హర్యానా చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. భార్య లేదా భ‌ర్త‌లు ఇతరులను ఇష్టపడుతున్నాడని అనుమానం వ‌స్తే మీరు ఏం చేస్తార‌ని ఆరియానా ని హీరోయిన్ అడ‌గ‌గా, చీపురు ఇర‌గదీసి కొడ‌తాన‌ని సమాధానం చెప్పింది. ఇలా విశ్వక్ సేన్ తో పాటూ ఇద్దరూ హీరోయిన్లు కూడ బిగ్ బాస్ లో చాల సరదాగ గడిపారు. ఇదిలా ఉండగా విశ్వక్ హీరో గా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంత చేసుకుంది. ఈ సినిమాని ఓటిటిలో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల గురించి స్పందించిన విశ్వక్ ఓటిటి లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.