Vishwak Sen: విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు రామ్‌నారాయణ్ తెరకెక్కించిన చిత్రమే లైలా. ప్రస్తుతం ఈ సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా వేడుకలో భాగంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పరోక్షంగా వైసిపిని ఉద్దేశించి కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా వైసిపి అభిమానులు ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ సినిమా గురించి పూర్తిస్థాయిలో నెగిటివిటీ రావడంతో విశ్వక్సేన్ సాహు గారపాటి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
ఇలా అభిమానులకు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా వైకాపా అభిమానులు ఏ మాత్రం శాంతించలేదు అయితే ఈ సినిమాని అదే స్థాయిలో వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో హీరో విశ్వక్సేన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇలా సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…
నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్.. నా సినిమాకు సంబంధించింది మాత్రమే. సినిమాల పోస్టర్స్, పోస్ట్‌లను షేర్ చేసే ప్రతిసారీ రెండుసార్లు ఆలోచించలేను. ఈ ఫొటోలో ఉంది సోనూ మోడల్.. ఫిబ్రవరి 14న మీ ముందుకు వస్తున్నాడు అంటూ ఈ పోస్టర్స్ షేర్ చేశారు అలాగే ట్విట్టర్లో బాయ్ కాట్ లైలా అంటూ వస్తున్నటువంటి హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడుతూ..
నేను ప్రతిసారీ తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన దానికి నిన్న మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెబుతున్నాను.. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ ఈయన చెప్పకు వచ్చారు. ఇలా విశ్వక్ సినిమాని చంపేయొద్దు అంటూ ప్రతిసారి కోరుతున్న పృథ్వీరాజ్ మాత్రం తాను క్షమాపణలు చెప్పేదే లేదు అంటూ వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వైకాపా అభిమానుల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదని తెలుస్తోంది.