Vishwak Pagal Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా సినిమాకీ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాడు. అలాగే తాజా సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేశాడు హీరో విశ్వక్ సేన్. అందులో భాగంగానే ఓ ప్రాంక్ వీడియో చేశాడు.
పబ్లిక్‌లో ఓ వ్యక్తితో సూసైడ్ డ్రామా చేయించి, న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఈ విషయమై ఓ అడ్వకేట్ విశ్వక్ సేన్‌పై ఫిర్యాదు కూడా చేశాడు. సరే, ఆ సంగతి అటుంచితే, ఓ మీడియా ఛానెల్ వారు ఇదే విషయమై ఓ డిబేట్ కండక్ట్ చేశారు.
ఆ క్రమంలో విశ్వక్ సేన్ మెంటల్ స్టేటస్‌పై సదరు ఛానెల్ యాంకర్ కాస్త ఓవరాక్షన్ చేసింది. పాగల్ సేన్, మెంటల్లీ డిస్ట్రబెడ్ పర్సన్ విశ్వక్ సేన్.. అనే పదాలు వాడుతూ బ్రేకింగ్ న్యూస్‌లు కొట్టారు. దాంతో విశ్వక్ సేన్‌కి ఒళ్లు మండింది. సదరు యాంకర్‌పై ఒకింత గుస్సా అయ్యాడు.
దాంతో ఆ యాంకర్ ‘గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో..’ అంటూ విశ్వక్ సేన్‌పై పెచ్చిపోయింది. విశ్వక్ సేన్ ఓ సెలబ్రిటీ.. పబ్లిసిటీ కోసం ఏం చేసినా కొట్టుకుపోతుంటాయ్. కానీ, జర్నలిస్టులకు అలా కాదు, షరతులు వర్తిస్తాయ్. సమాజానికి కట్టుబడి కొన్ని లిమిట్స్‌లో వ్యవహరించాలి వాళ్లు.
అలాంటిది.. ఆ ఛానెల్ జర్నలిస్టు ప్రదర్శించిన నోటి దురుసుని అస్సలు సమర్ధించలేం. ‘పాగల్’ అనే సినిమా చేసినంత మాత్రాన నటుడు విశ్వక్ సేన్‌ని ‘పాగల్ సేన్’ అని వ్యవహరించడం, ఆయన మెంటల్ స్టేటస్‌పై డిబేట్ నిర్వహించడం అస్సలు సబబు కాని విషయం.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయంలో పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు. ఈ నేపథ్యంలో సదరు జర్నలిస్టు తన ఓవరాక్షన్‌కి భారీ మూల్యం చెల్లించక తప్పదు మరి.