ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో విశ్వక్సేన్.ఇలా విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్న విశ్వక్ తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆయన చేసిన ఫ్రాంక్ వీడియో ఎంతటి వివాదం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ వివాదాల నడుమ ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ సినిమా మంచి విషయం అందుకోవడంతో హీరో విశ్వక్ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈయన ఒక్కో సినిమాకి 1.5 నుంచి2 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇక ఈయన నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయం అవడంతో ఒక్కసారిగా ఈయన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.
ఈయన పెంచిన రెమ్యూనరేషన్ విని నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారట. విశ్వక్ ఒకేసారి తన రెమ్యునరేషన్ కోటి రూపాయలు పెంచారు. మూడు కోట్ల రెమ్యూనరేషన్ అయితేనే తాను సినిమాల్లో నటిస్తానని లేకపోతే లేదని కరాఖండిగా చెప్పేస్తున్నారంట. ఏది ఏమైనా విశ్వక్ రెమ్యూనరేషన్ మాత్రం భారీగా పెంచి నిర్మాతలకు ఝలక్ ఇచ్చాడు. ఇలా ఈయన ఒకేసారిగా ఇంత రెమ్యూనరేషన్ పెంచడం విన్న పలువురు ఇలా రెమ్యూనరేషన్ భారీగా పెంచడంతో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కూడా వస్తాయి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.