ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకకు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పోరాటం జరిగి రేపటికి 400 రోజుకు చేరుకోనుంది. దీంతో ఈ సందర్భంగా స్టీల్ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు అయోధ్య రామ్ కొన్ని విషయాలను బయటపెట్టాడు. ప్రభుత్వరంగానికి చెందిన సంస్థలను ప్రైవేటీకరణం చేయకూడదని వైసీపీ, టీడీపీ నేతలతో పాటు పలు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.
ఇక బీజేపీతో జనసేన భాగస్వామ్యం అయినప్పటికీ కూడా తమకు పవన్ మద్దతు పలికాడని.. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటామని అన్నాడని తెలిపాడు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలను అమ్మాలని చూస్తే బిజేపి దీపం ఆరిపోవడం ఖాయమంటూ.. అన్ని పార్టీలు ఒక బృందంగా మారి ఒక నిర్ణయానికి రావాలని అన్నాడు. అంతేకాకుండా వంద మంది ఎంపీల సంతకాలతో ఢిల్లీ వెళ్లి పోరాడుతామని అన్నాడు. ఇక ఈ డిమాండ్ తో ఈనెల 28న విశాఖ బందుకు పిలుపునిస్తున్నట్లు తెలిపాడు.