తల్లి కాబోతోన్న అనుష్క.. ఆనందంలో విరాట్

విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ) జంట ఆనందంలో తేలిపోతోంది. ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము.. తర్వలోనే ముగ్గురం అవబోతోన్నామని గుడ్ న్యూస్‌ చెప్పారు. ఈ మేరకు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, సినీ స్టార్ అనుష్క శర్మ ప్రేమ, పెళ్లి విషయాలు అందరికీ తెలిసిందే. 2017లో వివాహా బంధంతో ఒక్కటైన ఈ జంట.. ప్రస్తుతం కొత్త తరానికి జన్మనివ్వబోతోంది.

Anushka Sharma Virat Kohli
Anushka Sharma Virat Kohli

విరుష్క ఇంట్లో కేరింతలు, నవ్వులు వినబడబోతోన్నాయి. లాక్ డౌన్‌లో విరుష్క జంట అందరికీ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భం దాల్చిన సంగతిని విరాట్ కోహ్లీ తెలిపాడు. 2021 జనవరిలో మేము ముగ్గురం కాబోతోన్నామని విరాట్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ న్యూస్ అటు సినీ అభిమానుల్లో, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపుతోంది.