Viral Video: ఈ రోజుల్లో పెట్స్ బర్త్ డేలు సెలెబ్రేట్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. అదే కోవలో .. ఓ కుటుంబం తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ కోడి ‘చిన్ను’ పుట్టినరోజును సెలెబ్రేట్ చేశారు. కోడి పుంజులంటే కొందరికి ఎంతో ప్రాణం. వాటిని సొంత పిల్లల్లానే చూసుకుంటారు.
అందుకే వేడుకకి అందరిని పిలిచి చిన్న పిల్లాడిలా ఆ కోడిని ముద్దు చేస్తూ ఒళ్ళో కుర్చోబెట్టుకొని మరీ 2వ ఏడాది కేక్ కట్ చేయించారు. ఈ తతంగం అంతా ఎక్కడో చెయ్యలేదు. మన తెలుగు రాష్ట్రాలోనే జరిగింది. ఏది ఏమైనా కోడి పుట్టినరోజు సెలెబ్రేట్ చెయ్యడం అనేది ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే.. ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్లు ఈ ఫ్యామిలీ మీద విరుచుకుపడుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో రావు రమేష్ అస్తమానం అనే ‘వీళ్ళని ఎవరికైనా చూపించండ్రా బాబు.. అలా వదిలెయ్యకండి రా’ డైలాగ్ తో కామెంట్లు పెడుతున్నారు.