Viral Poonam Kaur : వైరల్ – పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..పవన్ కోసమేనా?మ్యాటర్ ఏమిటంటే?

Viral Poonam Kaur : టాలీవుడ్ లో వివాదాలు ఎప్పుడూ కూడా కొత్త కాదు ఎప్పుడు నుంచో అనేక మంది విషయాల్లో వివాదాలు ఉన్నాయి. కొన్ని అందరికీ తెలిసినా తెలియనట్టే ఉంటారు.. కొన్ని తెలియనివి కూడా ఉంటాయి. మరి ఈ వివాదాల్లో పలువురు యంగ్ హీరోయిన్స్ కూడా లేకపోలేరు. వీటిలో బాగా నలిగిపోయిన అలాంటి ఓ యంగ్ హీరోయిన్స్ లో ఒకరే పూనమ్ కౌర్.
ఓ పక్క రాజకీయాల్లోకి ఆమెని లాగడం తన సినిమా లైఫ్ ని ముడిపెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిపి కామెంట్ చెయ్యడం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే వారి మధ్య ఎలాంటి గొడవ ఉంది అనేది పక్కన పెడితే.. ఒకోసారి పూనమ్ కౌర్ మాటలు ఆసక్తిగా ఉంటాయని చెప్పాలి.
కొన్ని సందర్భాల్లో పవన్ కి అనుగుణంగా మాట్లాడినట్టు ఒకోసారి టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆమె పెట్టిన ఓ సంచలన పోస్ట్ పరోక్షముగా పవన్ కి రిలేటెడ్ గానే ఉందనిపిస్తుంది. నిన్న జరిగిన “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ రాజకీయ నాయకులు కూడా వచ్చారు.
మరి బహుశా దీనిపైనే అన్నట్టుగా “ఇప్పుడు రాజకీయాలేమో ఎంటర్టైన్మెంట్ అయ్యాయి సినిమాలు ఏమో రాజకీయాలు అయ్యిపోయాయి” అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ అవ్వడం మొదలైంది. పైగా కింద కామెంట్స్ లో కూడా ఇది పవన్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ నే అని నెటిజన్స్ అంటున్నారు.
అయితే ఈమె చెప్పింది కూడా నిజమే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో సినిమాలు రాజకీయాలు అలానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పూనమ్ తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
https://twitter.com/poonamkaurlal/status/1496528004490862594?s=20&t=Fl4dO0nqpj1qlL5AUFZeCw