వైరల్ : ఎప్పుడూ చూడని అగ్రెసివ్ మోడ్ లో పవన్ కళ్యాణ్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో “హరిహర వీరమల్లు” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా చేస్తూనే పవన్ అయితే ఈ మధ్య తన పొలిటికల్ పరంగా బాగా బిజీగా ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా అయితే గత కొన్ని రోజులు నుంచి పవన్ పై వార్తలు సంచలనంగా కూడా మారాయి. మరి దీనితో ప్రతి రోజులు సినిమా అలాగే రాజకీయాల్లో పవన్ పేరు గట్టిగా వినిపిస్తుండగా ఇప్పుడు తాజాగా అయితే పవన్ కళ్యాణ్ పై కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

పవన్ ఇప్పట్టం అనే గ్రామానికి వెళ్లగా అక్కడ పోలీసులు పవన్ ని అడ్డుకునే ప్రయత్నం చెయ్యడం దీనితో పవన్ దీన్ని కూడా లెక్క చేయకుండా నది రోడ్డు పై అగ్రెసివ్ మోడ్ లో కనిపిస్తూ వెళ్ళిపోతున్నాడు. దీనితో ఈ వీడియోలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య అయితే క్రేజీగా మారాయి.

మరోపక్క పవన్ నుంచి ఈ తరహా రాజకీయాలు చూసి తాము కూడా తగ్గేది లేదు అంటూ వారి పార్టీ శ్రేణులు కూడా అంటున్నారు. మొత్తానికి అయితే పవన్ అటు రాజకీయాలు ఇటు సినిమాల నుంచి కూడా వరుస ట్రీట్ ని అయితే ఇస్తున్నాడు.