చిరు సాంగ్స్ కి స్టెప్పేసిన కింగ్ కోహ్లీ.. తన ఫ్రెండ్ పోస్ట్ వైరల్.!

అసలు తెలుగు సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే సినిమాల్లో డాన్స్ గతిని మార్చేసింది మెగాస్టార్ చిరంజీవి. తన పాత సినిమాల్లో రకరకాల డాన్స్ లు చేసి యువతని ఉర్రూతలూ ఊగించిన మెగాస్టార్ చిరు ఒక్క మన తెలుగు వారినే కాకుండా అప్పట్లో విరాట్ కోహ్లీ ని కూడా తన పాటలకి స్టెప్పులేసేలా చేశారట.

అయితే అసలు డీటెయిల్స్ లోకి ప్రస్తుత భారత జట్టు మాజీ క్యాప్టెన్ అలాగే డాషింగ్ బ్యాట్స్ మెన్ అయినటివంటి విరాట్ కోహ్లీని తన అండర్ 15 నాటి తెలుగు ఫ్రెండ్ ఒకరు ద్వారకా రవితేజ కలవడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లాడ్ సిరీస్ లో భాగంగా మ్యాచ్ చూసేందుకు తాను వెళ్లగా అక్కడ విరాట్ ని తాను కలిసాడు.

మరి అలా కావడంతోనే విరాట్ అతడిని చిరు కై సే హై తు? అని అడిగాడట. అంటే చిరు ఎలా ఉన్నావు అని అడిగాడట. మరి దీనికి కూడా ఓ స్టోరీ ఉందని చెప్పాడు. తాము ఇద్దరు అండర్ 15 టైం లో ఓకే రూమ్ మేట్స్ కాగా నేను ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి పాటు టీవిలో పెడుతుండే వాడిని అని..

ఆ టైం లో కోహ్లీ కూడా చిరు పాటలకి డాన్స్ చేసేవాడని ఇంట్రెస్టింగ్ అంశం రివీల్ చేసాడు. అంతే కాకుండా అప్పుడు నుంచి తాము సొంత పేర్లుతో కాకుండా ఇలా నిక్ నేమ్స్ తో పిలుచుకునేవాళ్ళం అలాగే ఈసారి కూడా  కలిసినపుడు కోహ్లీ చిరు అంటూ నన్ను పిలిచాడని ఇది ఎంతో ఆనందంగా ఉందని తెలిపి కోహ్లీతో దిగిన ఫోటో తాను షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.