వైరల్ : గరికపాటి పై కొత్త సెటైర్ వేసిన మెగాస్టార్ చిరంజీవి.!

రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అలాగే ప్రముఖ ప్రవచన కర్త మరియు పండితులు గరికపాటి నరసింహా రావు ల మధ్య ఎలాంటి యుద్ధం నెలకొందో చూసాము. అయితే చిరు పెద్దగా స్పందించింది ఏమి లేదు కానీ గరికపాటి అలయ్ బలయ్ మీటింగ్ లో చిరు పై పలు కామెంట్స్ చేస్తూ అసహనం వ్యక్తం చేయడం మెగా ఫ్యాన్స్ లో రచ్చ గా మారింది.

ఇక ఈ ఘటన తర్వాత అయితే మెగా ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇక దానితో గరికపాటి మెగాస్టార్ కి క్షమాపణ చెప్పడంతో అంతా సర్దుమణిగింది. అయితే ఆరోజు మెగాస్టార్ కొంతమంది మహిళలతో ఫోటోలు తీసుకునే సందర్భంలో ఈ కాంట్రవర్సీ జరగగా..

ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటన జరగడంతో గరికపాటిపై సెటైర్ వెయ్యడం మంచి కామెడీ కం వైరల్ గా మారింది. నిన్న ఓ మీటింగ్ లో పాల్గొన్న మెగాస్టార్ అక్కడ కూడా కొందరు మహిళలతో ఫోటో లు తీసుకోవాల్సి వచ్చింది. దీనితో ఆ సందర్భంలో ఇన్ డైరెక్ట్ గా “వారు ఇక్కడ లేరు కదా” అంటూ కామెంట్ చేసారు.

దీనితో ఈ వీడియో చూసిన వారు అంతా ఒక్కసారిగా నవ్వుకుంటూ మెగాస్టార్ టైమింగ్ అంటూ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి టైమింగ్స్ అన్నీ బాస్ కి సర్వ సాధారణమే కాగా ఇప్పుడు అయితే చిరు వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటిస్తున్నారు.