Mahesh Babu : వైరల్ : మహేష్ బాబుకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన నటసింహ బాలకృష్ణ!

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ టాప్ స్టార్ నటులలో నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా ఒకరు. మరి బాలయ్య అయితే ఎయిర్ రీసెంట్ గా తన భారీ సక్సెస్ “అఖండ” తో ట్రాక్ లో పడి మరిన్ని సాలిడ్ సినిమాలు ఓకే చేస్తూ వెళ్తున్నారు. అలాగే మహేష్ బాబు కూడా తన సినెమాలుతో బిజీగా ఉండగా ఈ ఇద్దరినీ ఒకే వేదికపైకి “ఆహా” వారు తీసుకొచ్చారు.

తెలుగు ఓటిటి యాప్ అయినటువంటి దీనిలో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో నే “అన్ స్టాప్పబుల్”. అయితే దాదాపు 12 ఎపిసోడ్స్ తో ఒక సీజన్ లా ప్లాన్ చేసిన ఈ షో లో ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ ని పిలిచి మరింత భారీ సక్సెస్ గా దీనిని చేశారు. మరి నిన్న శుక్రవారంతో ఈ సీజన్ కూడా ముగిసిపోయింది.

మరి ఈ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు తో బాలయ్య చేసిన పరాచకాలు, ఇద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. అయితే ఇదిలా ఉండగా ఈ షోలో మహేష్ బాబుపై బాలయ్య ఇచ్చిన ఒక ఎలివేషన్ అయితే ఓ రేంజ్ లో ఇప్పుడు వైరల్ అవుతుంది. బాలయ్య మహేష్ కోసం మాట్లాడుతూ..

“మహేష్ నువ్వు కేవలం ఒక నటుడువి మాత్రమే కాదు ఒక తరాన్నే ముందుకు తీసుకెళ్లగలిగే మార్గదర్శివి” అని కామెంట్ చేశారు. అయితే బాలయ్య నుంచి ఈ రేంజ్ ఎలివేషన్ ఈ మధ్య కాలంలో ఎవరిపై కూడా రాని వంటిది అని చెప్పాలి. ఇక మహేష్ అయితే ఇపుడు “సర్కారు వారి పాట” షూటింగ్ లో బిజీగా ఉండగా బాలయ్య పాలిటిక్స్ పనులు చూసుకుంటున్నారు. ఆ తర్వాత తన సినిమా షూట్ లో పాల్గొననున్నారు.