వైరల్ : విక్రమ్ లేటెస్ట్ వీడియో మెసేజ్ వైరల్.. ఇంతకీ ఏం చెప్తున్నాడంటే.!

గత రెండు రోజులు కితం కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో అయినటువంటి చియాన్ విక్రమ్ సడెన్ గా హెల్త్ పాడయ్యి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తాను నటించిన రెండు భారీ సినిమాలు పొన్నియిన్ సెల్వన్ అలాగే కోబ్రా చిత్రాలు నుంచి అప్డేట్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే విక్రమ్ కి ఇలా కావడం విక్రమ్ ఫ్యాన్స్ ని చాలా డిజప్పాయింట్ చేసింది. అయితే మరి విక్రమ్ కి ఏమీ కాదు అని త్వరలోనే డిశ్చార్డ్ అవుతారని అతనికి చికిత్స అందిస్తున్న కావేరి హాస్పిటల్ వారు తెలిపారు.

ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ సినిమా వర్గాల నుంచి సమాచారం ప్రకారం విక్రమ్ ఆరోగ్యం బాగానే ఉంది ఇంటికి కూడా నిన్న సాయంత్రమే వెళ్లిపోయారని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా విక్రమ్ నుంచి ఓ ఊహించని వీడియో మెసేజ్ బయటకి రావడం వైరల్ గా మారింది.

విక్రమ్ ఇప్పుడు తాను బాగానే ఉన్నానని హ్యాపీగా మాట్లాడుతూ అప్డేట్ ఇచ్చాడు. అంతే కాకుండా తన కోసం అంతమంది కోరుకోవడం చాలా సంతోషంగా ఉందని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని విక్రమ్ ఈ వీడియో ద్వారా తెలిపారు. అయితే ఇది చూస్తుంటే రేపు జరగబోయే కోబ్రా ఈవెంట్ లో పాల్గొనడం ఖాయం అని చెప్పాలి.