గ్లోబల్ గా అరుదైన ఘనత అందుకున్న “విక్రమ్” మ్యూజిక్ ఆల్బమ్.!

Kamal Haasan Vikram

ఈ ఏడాది దక్షిణాది సినిమా దగ్గర భారీ హిట్ అయ్యినటువంటి లేటెస్ట్ చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ “విక్రమ్” కూడా ఒకటి.

హిందీలో సరైన వసూళ్లు కూడా లేకుండా 400 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాకి ఉన్న బిగ్ ప్లస్ లలో బక్క మ్యూజిషియన్ అనిరుద్ ఇచ్చిన సంగీతం కూడా ఒకటి. తన నుంచి వచ్చిన ఎన్నో సెన్సేషనల్ హిట్ ఆల్బమ్స్ లో ఇది కూడా ఒకటి కాగా ఈ సినిమాలో స్కోర్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది.

అందుకే ఆడియెన్స్ ఎగబడి మరీ సినిమా చూసారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని ఇంటర్నెట్ లో రిలీజ్ చెయ్యగా భారతదేశం నుంచి ఏ సినిమా ఆల్బమ్ కూడా అందుకోని అరుదైన ఘనతని ఈ ఆల్బమ్ సెట్ చేసింది.

ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫై కోసం అందరికీ తెలిసిందే. అందులో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్ ఎన్నో ఇంగ్లీష్ ఆల్బమ్స్ ఉన్నా కూడా వాటికి ధీటుగా ఈ సినిమాకి చోటు దక్కడం నిజంగా గర్వ కారణమే మరి.

అందుకు అనిరుద్ కూడా ఈ విషయాన్ని పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సినిమాలో సూర్య పవర్ ఫుల్ కామియో లో నటించగా కమల్ నిర్మాణం వహించారు.