పవన్ – రాజమౌళిని కలిపే బాధ్యత తీసుకున్న విజయేంద్రప్రసాద్?

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రాజమౌళితో సినిమా చేయడం కోసం ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా కోసం ఎంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక తీరనుంది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.

వ్యక్తిగతంగా విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ ఎన్నోసార్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్రప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా విజయేంద్రప్రసాద్ తాను రాసిన కథను ఇతరులకు ఇవ్వరు. తప్పకుండా ఆ కథతో రాజమౌళి సినిమా చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళితో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా రాజమౌళి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్టు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు. ఈ సినిమా ఎంత లేదన్నా సుమారు రెండు సంవత్సరాలపాటు సమయం పడుతుంది.ఈ సినిమా పూర్తయిన తర్వాత ఒకవేళ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకుంటే రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా తెర పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయ్యేలోపు మరో రెండు సంవత్సరాల సమయం పడుతుంది. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా రావడానికి సుమారు నాలుగైదు సంవత్సరాలు సమయం పడుతుందని చెప్పాలి.