పవన్ కళ్యాణ్ కోసం కథలు రాయక్కర్లేదన్న విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad about writing story for Pawan Kalyan
Vijayendra Prasad about writing story for Pawan Kalyan
‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  అలీతో సరదాగా అనే టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు విషయాలను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం కథ రాయాల్సి వస్తే ఎలా రాస్తారు అనే ప్రశ్న రాగా అసలు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా కథలు రాయాల్సిన అవసరమే లేదన్నారు విజయేంద్ర ప్రసాద్. ఎందుకంటే పవన్ సినిమాలకు పవన్ ను చూడటానికి వస్తారు తప్ప కథ కోసం ఎవ్వరూ రారని అన్నారు ఆయన.  
 
ఆయన నటించిన సినిమాలలో అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసుకుంటే కథ తయారవుతుంది. ఆయనను చూడడానికే జనాలు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్  అమ్మాయిలతో పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, విలన్లను చితగ్గోట్టాలి.  ప్రజలకు మంచి చేయాలి.  ఇవి ఉంటే చాలు. ఆయన సినిమాల్లోని కొన్ని సీన్లను తీసుకుంటే చాలు కథ అయిపోతుంది. ఎందుకంటే డైనమైట్‌ని పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలు.
 
ఆయన పెద్ద డైనమైట్. కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ కితాబిచ్చారు.  గతంలో కూడ ‘బాహుబలి’ చిత్రంలోని పట్టాభిషేకం సన్నివేశానికి పవన్ కళ్యాణే ఇన్స్పిరేషన్ అన్నారు విజయేంద్ర ప్రసాద్.