AP: రూటు మార్చిన సాయి రెడ్డి….. వ్యవసాయం చేస్తా అంటూ ఆ పార్టీలోకి జంప్?

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 2024 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ఈ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇక ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి ఎవరికి ఉంది అంటే అది విజయసాయిరెడ్డికి అని చెప్పాలి అలాంటిది ఊహించని విధంగా విజయసాయిరెడ్డి కూడా ఈ పార్టీ నుంచి బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

ఇక ఈయన కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా తాను రాజకీయాలకే దూరంగా ఉంటున్నానని ప్రకటించారు అంతేకాకుండా ఇకపై తన జీవితం మొత్తం వ్యవసాయం చేసుకుంటూ గడిపేస్తానని కూడా తెలిపారు. ఈయన చెప్పిన విధంగానే పొలంలోకి వెళ్ళి నాలుగు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

ఇలా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా రూట్ మారుస్తూ మరో పార్టీలో జంప్ అవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ కి ఉపరాష్ట్రపతి ధన్కడ్‌ని స్వాగతించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చూసి.. తెరవెనక ఏదో జరుగుతోందనే డౌట్ రాజకీయ విశ్లేషకులకు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈయన బిజెపిలోకి రాబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే మరికొన్ని నెలలలో ఈయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా విజయసాయిరెడ్డి బిజెపి పార్టీలోకి వెళ్లడానికి గల కారణమేంటంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అవే కేసులు ఏ టు నిందితుడిగా విజయసాయిరెడ్డి మీద కూడా ఉన్నాయి అయితే ఈ కేసుల నుంచి బయటపడటం కోసమే విజయ్ సాయి రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారని పలువురు భావిస్తున్నారు. ఇలా ఎన్ని కేసులు ఉన్నా బిజెపికి అనుకూలంగా ఉంటే ఆ కేసులను కేంద్రం అసలు కదిలించడం లేదు గత పది సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కడ వ్యతిరేకంగా వ్యవహరించలేదు అందుకే ఆయన కేసులు ఒకటి కూడా ముందుకు కదలలేదని తెలుస్తోంది. ఇలా తన రక్షణ కోసమే వైసీపీ నుంచి బయటకు వచ్చిన సాయి రెడ్డి బిజెపి చెంతకు చేరుతున్నారని తెలుస్తోంది.