Vijay Sai Reddy: విజయ్ సాయి రెడ్డి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయన రాజీనామా చేసిన విషయం తెలిసినదే. జనవరి నెలలో సాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఇకపై ఎలాంటి రాజకీయ పార్టీలకు దగ్గర కానని ఇతర ఏ రాజకీయ పార్టీలలోకి వెళ్ళనని ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటాను అంటూ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ గురించి తెలిపారు.
ఈ విధంగా తాను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పినప్పటికీ ఈయన మాత్రం రాజకీయాల పరంగా చాలా బిజీగా ఉన్నారు. బిజెపికి చాలా దగ్గరవుతూ బిజెపి వ్యవహారాలలో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సాయి రెడ్డి బీజేపీలోకి చేరుతారు అంటూ వార్తలు కూడా వినిపించాయి ఇక బిజెపిలో ఈయన కోసం కీలక పదవి ఎదురు చూస్తుందని అందుకే ఇలా ఈ పార్టీకి రాజీనామా చేసి కమలం కండువా కప్పుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇక విజయ సాయి రెడ్డి జూన్ లేదా జూలై నెలలో బిజెపి పార్టీలోకి చేరుతారు అంటూ వార్తలు వినిపించాయి కానీ అంతకంటే ముందుగానే ఈయన కమలం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మరో వారం రోజులలో విజయసాయిరెడ్డి బిజెపిలోకి చేరబోతున్నట్టు తెలుస్తుంది. మరింత ఆలస్యమైతే బీజేపీలో కొని కీలక పదవులను వదులుకోవాల్సి వస్తున్న నేపథ్యంలోనే ఈయన బిజెపిలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.
విజయసాయి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం భర్తీకి ఈనెల (ఏప్రిల్)లోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అందుకే ఇదే సరైన సమయమని ఆయన భావించారట. ఈ టైంలో బీజేపీలో చేరి, రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు వస్తాయనే ఆలోచనలో సాయి రెడ్డి ఉన్నట్టు సమాచారం.కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే సాయి రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇలా ఈ కేసు నుంచి బయటపడటం కోసం కూడా ఈయన వెంటనే బిజెపిలోకి చేరాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.