తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని విజయ్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు గత రెండు చిత్రాలతో కొంచెం సఫలమయ్యాయి.’విజిల్, మాస్టర్’ చిత్రాలు తెలుగునాట మంచి సక్సెస్ సాధించాయి. అందుకే విజయ్ ఇంకో అడుగు ముందుకువేసి తెలుగు సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఆయన చూజ్ చేసుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వంశీ పైడిపల్లి చివరి చిత్రం ‘మహర్షి’. సినిమా మంచి హిట్ అయింది. నేషనల్ అవార్డ్ అందుకుంది. అందుకే విజయ్ పైడిపల్లికి ఓకే చెప్పారు.
వంశీ పైడిపల్లి సైతం విజయ్ కోసం మంచి కథను వెతికి పట్టుకున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందనుంది. ప్రాజెక్ట్ అయితే భారీగా ఉండనుంది. దీన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రజెంట్ లాక్ డౌన్ కావడంతో ఎలాంటి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నామని, పరిస్థితులు చక్కబడ్డాక సినిమా ప్రకటన ఉంటుందని అంటున్నారు వంశీ పైడిపల్లి. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుంది. దీంతో తెలుగులో స్థిరమైన మార్కెట్ ఏర్పరుచుకోవాలనేది విజయ్ ఆలోచన.