Vijay’s Beast : ట్విట్టర్ రివ్యూ : విజయ్ ఏక్షన్ బ్లాస్ట్ “బీస్ట్” రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి.!

 Vijay’s Beast : తమిళ నాట భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో థలపతి విజయ్ కూడా ఒకడు. అక్కడ తన క్రేజ్ గాని తన సినిమాలకు అభిమానులు సెట్ చేసే రికార్డులు గాని వేరే లెవెల్లో ఉంటాయి. అలా తాను నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “బీస్ట్” ఎట్టకేలకు నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచి షో స్టార్ట్ అయ్యింది.
అయితే విజయ్ సినిమాలు ఎంత భారీ లెవెల్లో రిలీజ్ అవుతాయో ఇది కూడా ఆ రేంజ్ లోనే రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా చూసిన ఆడియెన్స్ మరియు సినీ ప్రముఖులు ఈ సినిమా ఎలా ఉందో తమ రివ్యూ లు సోషల్ మీడియాలో తెలుగు మరియు తమిళ్ వెర్షన్ కి సంబంధించి అందిస్తున్నారు.
అయితే ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా ఫక్తు యావరేజ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ డాన్స్ లు గాని పెర్ఫామెన్స్ గాని బాగానే ఉన్నా సినిమా మాత్రం తేలిపోయినట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే కొంతమంది విజయ్ ఫ్యాన్స్ అయితే డిజప్పాయింట్ కూడా అయ్యారు.
అలాగే దర్శకుడు నెల్సన్ రెండు సినిమాలతో పోలిస్తే ఇది వరస్ట్ వర్క్ అని కూడా కొందరు అంటున్నారు. అలాగే సినిమా చాలా వరకు అంచనా వేయగలిగే టైప్ లోనే ఉందని ఏక్షన్ బ్లాక్ లు బాగున్నాయని అంటున్నారు.
ఇలా కంప్లీట్ గా చూస్తే సినిమాకి యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.
సో సినిమా అయితే పెద్దగా లేదనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం ఇచ్చాడు. అలాగే సన్ పిక్చర్స్ వాళ్ళు నిర్మాణం అందించారు.
https://twitter.com/MalayalamReview/status/1514056323435929602?s=20&t=2XAcOGqye0u1IODJRHUaFg