Vijaya Devarakonda: మహేష్ బాబు స్థానాన్ని ఆక్రమించుకున్న విజయ్ దేవరకొండ.. ఏం జరిగిందంటే?

Vijaya Devarakonda: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుని అనంతరం పాన్ ఇండియా హీరోగా సినిమాలలో నటిస్తున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఎన్నో ఆన్లైన్ వస్త్రాలకు సంబంధించిన బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా తాజాగా థమ్స్ అప్ యాడ్ కోసం ఈ రౌడీ హీరో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.థమ్స్ అప్ యాడ్ అంటేనే ఒకప్పుడు చిరంజీవి ఆ తర్వాత మహేష్ బాబు నటించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు స్థానంలోకి విజయ్ దేవరకొండ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ యాడ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చేతిలో బాటిల్ పట్టుకొని వుండగా ఆ బాటిల్ పై సాఫ్ట్ డ్రింక్ కాదు ఇది తుఫాన్ అని ఉంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు నిజంగానే విజయ్ దేవరకొండ తుఫాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇకపై థమ్స్ అప్ యాడ్ లోమహేష్ బాబు కాకుండా విజయ్ దేవరకొండ సందడి చేయనున్నట్లు తెలుస్తుంది మరి ఈ వీడియోలో విజయ్ దేవరకొండ ఎలా చేశారు అనే విషయం తెలియాలంటే మరి కొంత సమయం పాటు వేచి ఉండాల్సిందే.