అల్లు అర్జున్‌కు బ‌ట్ట‌లు పంపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నీ ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు అంటూ బన్నీ ట్వీట్

అతి త‌క్కువ టైంలోనే ఫుల్ క్రేజ్ పొందిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌ని స్టైల్‌కు, బాడీ లాంగ్వేజ్‌కి ఫిదా కాని వారు లేరు. అభిమానులే కాదు సెల‌బ్రిటీలు సైతం విజ‌య్ డ్రెస్సింగ్ స్టైల్‌ని చాలా ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే బ‌న్నీ అప్ప‌డుప్పుడు విజ‌య్.. రౌడీ బ్రాండ్స్ బ‌ట్ట‌లు తెప్పించుకుంటాడు. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తుండ‌గా, ఆ రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ను విజయ్ త‌న‌ బన్నీకి బహుమతిగా పంపిస్తుంటారు. ఈ ఏడాది మొద‌ట్లో విజ‌య్ పంపించగా, ఆ విష‌యాన్ని స్టైలిష్ స్టార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

ఏడాది మొద‌ట్లో బ‌న్నీకి పంపిన క్లోత్స్‌ని విజ‌య్ ద‌గ్గ‌రుండి మ‌రీ డిజైన్ చేశారు. ఆ బ‌ట్టలు అందుకున్న
బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ‘చెప్పిన విధంగా బట్టల్నీ పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్ విజయ్.. అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకల్లో ప్రేమతో పంపిన ఈ బట్టల్నే ధరిస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. ఇక తాజాగా మ‌రోసారి అల్లు అర్జున్‌పై ప్రేమ‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త దుస్తుల‌ని పంపించారు. వాటిని ధ‌రించి ప‌లు ఫొటోలు దిగిన అల్లు అర్జున్ .. విజ‌య్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

నా సోద‌రుడు విజ‌య్ దేవ‌ర‌కొండ, రౌడీ క్ల‌బ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. నాకు కంఫ‌ర్ట్‌గా ఉన్న దుస్తుల‌ని పంపారు. నా పై ప్ర‌త్యేక‌మైన ప్రేమ చూపిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అంటూ స్టైలిష్ స్టార్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం బ‌న్నీ .. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. కొద్ది రోజుల పాటు అడ‌వుల‌లో షూటింగ్ జ‌రుపుకున్న చిత్ర బృందం రీసెంట్‌గా హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఇక విజ‌య్.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నాడు.