శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్టోబర్ 25 దీపావళితో లాంగ్ వీకెండ్‌ను ప్రిన్స్ క్యాష్ చేసుకోనుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఒక ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయి ప్రేమ కథ, వారి ప్రేమ కథలోని సమస్యల హిలేరియస్ గా ట్రైలర్ ప్రజంట్ చేసింది. శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క ఇద్దరూ ఒక పాఠశాలలో పని చేస్తుంటారు. శివకార్తికేయన్ తండ్రిగా సత్యరాజ్ ఒక సంఘ సంస్కర్త, తను ప్రేమకి ఆమోదాన్ని తెలిపినప్పటికీ, ప్రేమకథకు మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి.

అనుదీప్ కెవి విభిన్నమైన రోమ్-కామ్‌ని ఎంచుకుని, దానిని తన శైలిలో ప్రజంట్ చేశాడు. ట్రైలర్‌లో దాదాపు ప్రతి సన్నివేశంలో మంచి హాస్యం వుంది. శివకార్తికేయన్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సత్యరాజ్ పాత్ర కూడా చాలా వినోదాన్ని పంచింది.  శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క ల జోడి ఫ్రెష్ గా కనిపించింది.

సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు ఎస్ థమన్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నత స్థాయిలో వుంది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి  ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి

సంగీతం: ఎస్ థమన్

నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు.

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్

సమర్పణ: సోనాలి

డీవోపీ: మనోజ్ పరమహంస

సహ నిర్మాత:  అరుణ్ విశ్వ

ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

ఆర్ట్ : నారాయణ రెడ్డి

పీఆర్వో : వంశీ-శేఖర్