డ్రైవర్ లేకున్నా రోడ్డు మీద రయ్ మంటున్న కారు.. తలగోక్కుంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో

Video of driverless car in Tamil Nadu goes viral

ఈ వీడియో చూస్తే మీ మతి కూడా పోతుంది. ఎందుకంటే.. ఆ కారు డ్రైవింగ్ సీటులో ఎవ్వరూ ఉండరు. కానీ కారు మాత్రం రయ్ మంటూ వెళ్తుంది. పక్కన సీట్లో మాత్రం ఓ వ్యక్తి కూర్చొని ఉంటాడు. హైవే మీద కారు మాత్రం దూసుకుపోతుంది. ఇదేలా సాధ్యం అంటారా? అది తెలియకనే నెటిజన్లు కూడా నెత్తి గోక్కుంటున్నారు. ఆ వీడియోను ఎన్ని సార్లు చూసినా.. ఆ కారును ఎవరు నడుపుతున్నారో అర్థం కాక పిచ్చోళ్లు అవుతున్నారు.

Video of driverless car in Tamil Nadu goes viral
Video of driverless car in Tamil Nadu goes viral

ఓ కారు రోడ్డు మీద రయ్ మంటూ దూసుకుపోతుంది కానీ.. ఆ కారుకు డ్రైవర్ లేడు.. దీంతో ఆ కారు వెనుక వెళ్తున్న మరో కారులో ఉన్న ఓ వ్యక్తి.. ఆ డ్రైవర్ లేని కారును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లకు కూడా అసలు ఆ కారు ఎలా డ్రైవర్ లేకున్నా నడుస్తోందని ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Video of driverless car in Tamil Nadu goes viral
Video of driverless car in Tamil Nadu goes viral

ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకున్నది. అయితే.. ఆ వ్యక్తిది వెల్లూరు అని. డ్రైవర్ సీటులో కాకుండా.. పక్క సీటులోనే కూర్చొని ఆయన కారు చాలాసార్లు నడుపుతుంటే మేం చూశామని చాలామంది చెబుతున్నా… అది ఎలా సాధ్యం అవుతుందని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

మీరు కూడా ఓసారి ఆ వీడియో చూసి.. కాస్త చెప్పండి.. అది ఎలా సాధ్యమయిందో?