వయసు మళ్ళిన హీరోయిన్ కూడ బాలకృష్ణ సినిమాకు నో చెప్పిందా ?

Veteran actresses says no to Balakrishna's film
Veteran actresses says no to Balakrishna's film
మన సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.  అందునా బాలకృష్ణ చిత్రాలకు కథానాయికలు దొరకడం ఇంకా క్లిష్టమైంది.  ‘అఖండ’ చిత్రానికి హీరోయిన్ ను తీసుకురావడానికి ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత శ్రమించారో చెప్పనక్కర్లేదు.  చివరికి సెకండ్ టైర్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నారు.  ఇప్పుడు ఇదే సమస్య గోపిచంద్ మలినేని సినిమాను కూడ వెంటాడుతోంది.  మొదట్లో ఆయన తన లక్కీ హీరోయిన్ శృతి హాసన్ ను బాలకృష్ణకు జోడీగా తీసుకురావాలని చాలా ట్రై చేశారు కానీ అది కుదరలేదు.  ఆమె తర్వాత మరికొందరిని సంప్రదించినా వారు కూడ ఒప్పుకోలేదట. 
 
ఇక తాజాగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సీనియర్ హీరోయిన్ టబు కూడ నో చెప్పినట్టు తెలుస్తోంది.  గోపిచంద్ మలినేని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నారు.  కథ ప్రకారం ఇందులో సీనియర్ నటి చేయాల్సిన రోల్ ఒకటి ఉందట.  ఆ పాత్రలో ఫేమ్ ఉన్న నటిని తీసుకోవాలని భావించిన గోపిచంద్ టబును అప్రోచ్ అయ్యారట.  కానీ ఆమె మాత్రం సున్నితంగా నో చెప్పారట.  దీంతో డైరెక్టర్ వేరే సీనియర్ నటిని వెతుక్కునే పనిలో పడ్డారట.  ఇప్పటివరకు ఈ సినిమాకు ఫైనల్ అయిన హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక్కరే.  అది కూడ ‘క్రాక్’ సినిమాలో ఆమె చేసిన పాత్ర తరహా పాత్ర కావడంతో ఓకే చెప్పడం జరిగింది.  మరి గోపిచంద్ మలినేని కథానాయికల వేటలో ఇంకెన్ని కష్టాలు పడాలో ఏమో.