రానా పైన ఫైర్ అయిన వెంకటేష్

దగ్గుబాటి ఫామిలీ లెగసీ ని కొనసాగిస్తూ రానా దగ్గుబాటి హీరో గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. కానీ హీరో గా అనుకున్నంత గా సక్సెస్ కాలేదు, కానీ విలన్ గా బాగానే సక్సెస్ అయ్యాడు. ‘బాహుబలి’, ‘భీమ్లా నాయక్’ లాంటి సినిమాల్తో రానా విలన్ గా సక్సెస్ అందుకున్నాడు. హీరో గా వచ్చిన ‘విరాట పర్వం’, ‘అరణ్య’ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు రానా. అయితే తాజా సమాచారం ప్రకారం దగ్గుబాటి ఫామిలీ మొత్తం ఒక కండిషన్ పెట్టుకున్నారంట. ఇక పైన  ఎవరు కూడా సమంతతో మాట్లాడకూడదని ..ఆమెను కలవకూడదని  ఓ కండిషన్ పెట్టుకున్నారట. నాగచైతన్యను బాధపెట్టిన సమంత తో  మనకి ఏ సంబంధం లేదు అంటూ ఆమెతో ఎవరు మాట్లాడొద్దు.. ఆమెను కలవదు అంటూ అందరికీ ఒక కండిషన్ పెట్టారట వెంకటేష్ .

కానీ రానా మాత్రం ఆ కండిషన్ ని బ్రేక్ చేసాడంట. సమంత హెల్త్ బాగోలేదు అని వరుసగా వార్తలు వినిపిస్తున్న క్రమంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో నిజంగానే తనకి హెల్త్ బాగోలేదా అంటూ రానా ఆమెకు ఫోన్ చేసి పలకరించాడట. ఈ విషయం పై వెంకటేష్ చాలా బాధపడ్డరని అలాగే రానా మీద కూడా ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.