‘వరుడు’ మామూలోడేం కాదు సుమీ.!

Varudu Doing Best For His Film | Telugu Rajyam

ప్రమోషన్స్‌లో వెనకబడ్డాడనుకున్నాం కానీ, ‘వరుడు’ పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడని అర్ధమవుతోంది. నాగశౌర్య హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’ ప్రమోషన్స్ దద్దరిల్లిపోతున్నాయనే చెప్పాలి. ఏ అకేషన్‌నీ వదిలి పెట్టడం లేదు.

పెళ్లి చూపులూ, పెళ్లి బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటూ, సంగీత్ ఫంక్షన్ అంటూ ఇప్పటికే గ్రాండ్‌గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యింది కూడా. అలాగే, టీవీ ఛానెళ్లలోనూ కొన్ని ఇన్నోవేటివ్‌గా ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేశారట.

ఇదిలా ఉంటే, తాజాగా ఓ పెళ్లి వేడుకను సైతం తమ సినిమా ప్రమోషన్ కోసం ‘వరుడు’ టీమ్ వాడేసుకోవడం విశేషం. ఓ పెళ్లి వేడుకకు మన హీరోగారు, హీరోయిన్‌తో కలిసి జంటగా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘వరుడు’ ప్రమోషన్స్ పోలా అదిరిపోలా.

ఇకపోతే లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘వరుడు కావలెను’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles