ఏపీ ప్రభుత్వం పై మండిపడ్డ టీడీపీ నేత వర్ల రామయ్య..?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 25 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ చిత్రబృందం అన్ని విధాలుగా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. కానీ మరొక వైపు ఏవి ప్రభుత్వం ఈ సినిమా పై ఆంక్షలు విధిస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన సైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ ఇప్పుడు మాత్రం అదనంగా ఐదవ షో ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వివాదం రేగింది. ఈ క్రమంలోనే టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే బిమ్లా నాయక్ సినిమాపై చర్యలకు దిగుతున్నారు అంటూ విమర్శించారు. ఈ ఒక్క సినిమా పట్ల జగన్ సర్దార్ ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా ఎవరూ చూడకూడదనే ఆదేశాలు కూడా ఇస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు వర్ల రామయ్య.