ఆ ఐదు రోజులు పవన్ దున్నేసుకుంటాడు

Vakeel Saab
Vakeel Saab
Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ ఆశలున్నాయి. సాధారణంగా పవన్ సినిమా అంటే కమర్షియల్ లెక్కలే ఉంటాయి. కానీ ఈసారి ఎమోషనల్ లెక్కలూ ఉన్నాయి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఆయన్ను వెండి తెర మీద చూడబోతున్నామనే ఆనందంలో ఉన్నారు ఫాన్స్. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు మేకర్స్. అందుకే విడుదలను పక్కాగా ప్లాన్ చేసి పెట్టారు. ఏప్రిల్ 9న చిత్రం విడుదలకానుంది.

9వ తేదీ శుక్రవారం కాబట్టి థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి బలంగానే ఉంటుంది. ఇక 10వ తేదీ రెండవ శనివారం, 11న ఆదివారం కాబట్టి సాధారణ ప్రేక్షకులు సినిమా హాళ్లకు పోటెత్తుతారు. మధ్యలో సోమవారం 12ను మినహాయిస్తే తర్వాత 13వ తేదీన మంగళవారం ఉగాది హాలీడే. అలాగే 14వ తేదీ బుధవారం అంబేద్కర్ జయంతి సెలవు. సో మొత్తంగా సినిమాకు నాలుగు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. పైగా పోటీగా పెద్ద సినిమాలేవీ విడుదలకావట్లేదు. ఎక్కువ శాతం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ చిత్రమే ఉంటుంది. సో.. అన్ని సెలవు రోజులను సోలోగా క్యాష్ చేసుకోనున్నాడు పవన్. సినిమా గనుక మొదటిరోజు హిట్ టాక్ తెచ్చుకోగలిగితే ఆ ఐదు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టుకోవడం ఖాయం.